ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించి షాకిచ్చే అప్డేట్

Published : Feb 13, 2023, 06:13 PM IST
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించి షాకిచ్చే అప్డేట్

సారాంశం

ప్ర‌భాస్ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే గ్యాప్ లేకుండా వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు చెబుతున్నారు. 

"కే జి ఎఫ్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతుందని సమాచారం. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం అదిరిపోయే షూటింగ్ సెట్లను కూడా నిర్మించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం తారక్ మూడు సంవత్సరాలు డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం రెండు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మాసివ్ గా భారీ స్కేల్ లో ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ప్లాన్  చేసారని చెప్తున్నారు. ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్టుగా దీన్ని మలచాలని భావిస్తున్నారట. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. ఆగ‌స్ట్ నెలాఖ‌రులోగా స‌లార్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ప్ర‌భాస్ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే గ్యాప్ లేకుండా వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు చెబుతున్నారు. 

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ‌త మే నెల‌లో ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొడ‌వైన గ‌డ్డం, మీస‌క‌ట్టుతో ఎన్టీఆర్ క‌నిపించారు. భూమిపుత్రుడుగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ క‌న‌పించ‌బోతున్న‌ట్లు ప్ర‌శాంత్ నీల్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో రూపొందించనున్నారు.

ఇక "ఆచార్య" సినిమాతో తన కెరియర్ లోనే మొట్టమొదటి డిసాస్టర్ ను అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని త్వరలోనే మొదలుపెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు చెబుతున్నారు.   ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?