మాస్క్ వేసుకుని భయంతో పెళ్లి.. నా కాబోయే భార్య అందుకు ఒప్పుకుంది: నితిన్

Published : Apr 12, 2020, 03:32 PM IST
మాస్క్ వేసుకుని భయంతో పెళ్లి.. నా కాబోయే భార్య అందుకు ఒప్పుకుంది: నితిన్

సారాంశం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. కరోనా సోకినా వారు అనారోగ్యంతో బాధపడుతుంటే.. మిగిలిన వారి తమ డే టు డే లైఫ్ ని కోల్పోయారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ జన జీవితాన్ని స్తంభింపజేసింది. కరోనా సోకినా వారు అనారోగ్యంతో బాధపడుతుంటే.. మిగిలిన వారి తమ డే టు డే లైఫ్ ని కోల్పోయారు. ప్రపంచ దేశాలు కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాయి. పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

యంగ్ హీరో నితిన్ వివాహం ఈ నెల 16న జరగాల్సి ఉంది. నితిన్ పెళ్లిని ఏ నెల 16న కుటుంబ సభ్యులు దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్ణయించారు. కానీ కరోనా ప్రభావంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. తన పెళ్లి వాయిదా పడడంపై నితిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 

మహేష్ బాబు పేరు కలిసేలా కొడుక్కి నామకరణం చేసిన అనిల్ రావిపూడి

కరోనా లేకపోతే ఈ పాటికి తాను పెళ్లి పనుల్లో బిజీగా ఉండేవాడిని అని నితిన్ తెలిపాడు. అన్ని విషయాలు ఆలోచించే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు నితిన్ తెలిపాడు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. సినిమాలు పోతే మరో హిట్ సినిమా చేసుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే మనం బావుంటేనే సాధ్యం. 

ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్ లేకుండా మనస్ఫూర్తిగా పెళ్లి వాయిదా వేశా. పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమేజరిగేది. పెళ్లి సంతోషంగా జరగాలి అంతే కానీ భయంగా మాస్కులు వేసుకుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పరిస్థితులు చిక్కబడ్డాక పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే మా కుటుంబ సభ్యులు, నాకు కాబోయే శ్రీమతి షాలిని సంతోషంగా ఒప్పుకున్నట్లు నితిన్ చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?