మొన్న రష్మిక, ఇప్పుడు నిధి.. కుర్ర భామలతో మహేష్ రొమాన్స్!

Published : Jan 29, 2020, 11:58 AM IST
మొన్న రష్మిక, ఇప్పుడు నిధి.. కుర్ర భామలతో మహేష్ రొమాన్స్!

సారాంశం

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నారు. మహేష్ పక్కన రష్మిక అనగానే భిన్నాభిప్రాయలు వినిపించాయి. కానీ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా రోల్ లేకపోవడంతో జనాలు కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లతో మాత్రమే కలిసి నటించిన మహేష్ బాబు ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త పేరున్న హీరోయిన్ అయినా నటించడానికి వెనుకాడడం లేదు.

ఈ క్రమంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నారు. మహేష్ పక్కన రష్మిక అనగానే భిన్నాభిప్రాయలు వినిపించాయి. కానీ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా రోల్ లేకపోవడంతో జనాలు కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి. అయితే ఇప్పుడు మరో కుర్ర హీరోయిన్ తో మహేష్ బాబు సినిమా చేయనున్నాడని టాక్.

టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ చేతుల్లో వందల కోట్లు.. వివరాలు ఇవే!

'మహర్షి' సినిమా సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మరో సినిమా చేస్తానని చెప్పిన మహేష్.. ఇప్పుడు ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మహేష్ బాబు 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారని సమాచారం.

దాదాపు ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో సరసన నిధి అగర్వాల్ కి ఛాన్స్ రావడం విశేషమే.. తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' తప్ప ఆమె గ్రాఫ్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఇప్పుడు సూపర్ స్టార్ పక్క సినిమా అంటే ఆమె కెరీర్ కి ప్లస్ అవ్వడం ఖాయం. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?