
కోవిడ్ తరువాత తెలుగు పరిశ్రమకు మళ్లీ ఊపిరి ఇచ్చిన సినిమా ‘ అఖండ’. నందమూరి నటసింహం బాలకృష్ణ శక్తి వంతమైన ,శక్తి వంచనలేని యాక్షన్.. బోయపాటి శ్రీను డైరక్షన్ టాలెంట్, థమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసి ‘ అఖండ’ సినిమాకు సాలిడ్ హిట్ ఇచ్చాయి. బాలయ్య ‘ అఖండ’ ఇచ్చిన ఊపుతో పెద్ద సినిమాల నిర్మాతలకు, హీరోలకు ధైర్యం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఒకే రోజు ఎక్కువ థియోటర్స్ లో రిలీజ్ అవటం, ఓటిటి రిలీజ్ లు అవుతున్న ప్రస్తుత కాలంలో ఓ సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా అరుదు. అలాంటి కొత్త రికార్డ్ ను బాలయ్య మరోసారి నెలకొల్పాడు.
గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈసినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఏ సెంటర్ అయినా.. జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోయేలా చేసిన ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది. జనవరి 20వ తేదీ నాటికి ఈ సినిమా 103 థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలో ఇన్ని థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకున్న సినిమా లేదు. ఇక అప్పటి నుంచి అలా కొనసాగుతూ వస్తున్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన 100 రోజులను పూర్తిచేసుకోనుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని ఈ సినిమా టీమ్ నిర్ణయించుకుంది. ఈ నెల 12వ తేదీన కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో 'కృతజ్ఞత సభ'ను ఏర్పాటు చేశారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. అందుతున్న సమాచారం మేరకు ఈ వంద రోజులు పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా తన కుమారుడు మోక్షజ్ఞ లాంచింగ్ డిటేల్స్ ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే నందమూరి అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
తెలుగులో చాలా మంచి సినిమాలు వచ్చాయి కానీ అఖండ 100 రోజులు పూర్తి చేసుకోగలిగింది, ఈ విషయాన్ని గుర్తు చేసుకునే అభిమానులకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఊహించని రీతిలో 100 రోజులు వచ్చిన ఈరోజు అఖండ 100 రోజుల పోస్టర్ టీమ్‌కు గర్వకారణంగా నిలుస్తోంది. కృతజ్ఞతా పూర్వకంగా, మేకర్స్ ఈ అరుదైన ఫీట్‌ని మార్చి 12న కర్నూలులో జరుపుకుంటున్నారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ చిత్రం 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేయడంతో అఖండ మొత్తం అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, ఈ చిత్రం NBKకి అత్యధిక వసూళ్లు రాబట్టి, అతని మునుపటి బెస్ట్‌ను దాదాపు రెట్టింపు చేసింది.