నా భర్తకు ఇది మూడో పెళ్లి.. నేను కూడా వర్జిన్ కాదు.. నటి కామెంట్స్!

Published : Jan 10, 2020, 05:07 PM IST
నా భర్తకు ఇది మూడో పెళ్లి.. నేను కూడా వర్జిన్ కాదు.. నటి కామెంట్స్!

సారాంశం

తనను అవమానిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. దానికి కారణం నేహా పెళ్లి చేసుకున్న శార్దూల్ కి గతంలో రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్నారు. అలాంటిది నేహా అతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. 

ప్రముఖ నటి నేహా పెండ్సే కొంతకాలం పాటు  బిజినెస్‌మెన్‌ శార్దూల్ సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. గతేడాది ఆగస్టులో ఈ జంటకి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఆప్పుడు నేహాని తన పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తనను అవమానిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

దానికి కారణం నేహా పెళ్లి చేసుకున్న శార్దూల్ కి గతంలో రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్నారు. అలాంటిది నేహా అతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో నేహా ఆగ్రహానికి లోనైంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి ధీటుగా బదులిచ్చింది.

టీవీ సీరియల్ లో మహేష్ బాబు.. యాంకర్ ప్రదీప్ మామూలోడు కాదు!

తను ప్రేమించిన వారంతా పెళ్లి అనేసరికి తప్పించుకుతిరిగారని.. కానీ శార్దూల్ అలాంటి వ్యక్తి కాదని చెప్పుకొచ్చింది. శార్దూల్ గతంలో రెండు సార్లు పెళ్లి విషయంలో విఫలమైనప్పటికీ అతడిని ఇంకా వైవాహిక జీవితంపై నమ్మకం పోలేదని.. అందుకే అతడికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపింది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనప్పుడు విడిపోవడమే మంచిదని.. ఆయనకి ఇది మూడో పెళ్లి అయితే ఏంటి..? ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు..? అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి..? అని మండిపడింది. రెండో పెళ్లి కూడా చేసుకొని విడిపోయిన వ్యక్తితో పెళ్లి ఏంటని..? చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని.. ఆ రకంగా చూసుకుంటే నేను కూడా వర్జిన్ కాదంటూ వెల్లడించింది.  

ఇక ‘కేప్టన్‌ హౌస్‌’ షోతో బుల్లితెరకు పరిచయమైన నేహా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఎన్నో హిట్‌ షోలతో పాటు బిగ్‌బాస్‌ 12 హిందీలోనూ తళుక్కున మెరిసింది. తెలుగులో కేవలం సొంతం, వీధి రౌడీ చిత్రాల్లో మాత్రమే నటించింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?