టీవీ సీరియల్ లో మహేష్ బాబు.. యాంకర్ ప్రదీప్ మామూలోడు కాదు!

Published : Jan 10, 2020, 04:29 PM IST
టీవీ సీరియల్ లో మహేష్ బాబు.. యాంకర్ ప్రదీప్ మామూలోడు కాదు!

సారాంశం

ప్రచారంలో భాగంగా మహేష్ బాబు పాపులర్ టీవీ సీరియల్ 'తూర్పు పడమర'లో కనిపిస్తారట. ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రోమోకి సంబంధించిన షూటింగ్ నిన్న రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగినట్లు సమాచారం. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న నూతన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది.

సినిమా టీమ్ ప్రచారకార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి విశేషాలు వెల్లడిస్తూ హైప్ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మహేష్ బాబు పాపులర్ టీవీ సీరియల్ 'తూర్పు పడమర'లో కనిపిస్తారట.

'అల.. వైకుంఠపురములో' నిర్మాత నేనే.. బన్నీ కొడుకు రచ్చ

ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రోమోకి సంబంధించిన షూటింగ్ నిన్న రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగినట్లు సమాచారం. ఈ షూట్ లో మహేష్ తో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నాడు. ఈ సీరియల్ ఐడియా ఇచ్చింది యాంకర్ ప్రదీప్ అని తెలుస్తోంది. మరి సీరియల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా హాజరవుతారా..? లేక సీరియల్ నటీనటులతో ముచ్చటిస్తారా..? అనే విషయం తెలియాల్సివుంది.

ఏదేమైనా బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం ఇది మంచి సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇక ఈరోజు సాయంత్రం వరకు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటుంది. ఆ తరువాత యూనిట్ కి మహేష్ బాబు స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కి ముందే తన టీమ్ కి పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?