'Ex'కి ఓకే చెప్పిన నయనతార.. కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్

Published : Jun 04, 2020, 02:35 PM ISTUpdated : Jun 04, 2020, 02:44 PM IST
'Ex'కి ఓకే చెప్పిన నయనతార.. కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్

సారాంశం

ఒకప్పుడు నయనతార, ప్రభుదేవా పెళ్లి పీటల వరకు వెళ్లారు. చాలా కాలం పాటు చట్టా పట్టా లేసుకుని తిరిగారు. అప్పట్లో పెళ్ళైన ప్రభుదేవాకి నయనతార ప్రేమించడంతో అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఆమెపై విమర్శలు కూడా తలెత్తాయి.

ఒకప్పుడు నయనతార, ప్రభుదేవా పెళ్లి పీటల వరకు వెళ్లారు. చాలా కాలం పాటు చట్టా పట్టా లేసుకుని తిరిగారు. అప్పట్లో పెళ్ళైన ప్రభుదేవాకి నయనతార ప్రేమించడంతో అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఆమెపై విమర్శలు కూడా తలెత్తాయి. కొంత కాలం ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించాక విభేదాలతో అతడి నుంచి విడిపోయింది. 

త్వరలో వీరిద్దరూ ఓ సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా సౌత్ లో బిగ్ న్యూస్. సౌత్ లో నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన మాజీ ప్రియుడి చిత్రంతో నటించబోతోంది అంటే అభిమానులు షాక్ కి గురి కావడం ఖాయం. 

ప్రభుదేవా దర్శత్వం వహించబోయే ఓ చిత్రానికి నయనతార హీరోయిన్ గా ఎంపికైందనేది లేటెస్ట్ న్యూస్. గణేష్ అనే తమిళ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో కార్తీ, విశాల్ కలసి ఈ చిత్రంలో నటించబోతున్నారు. నయనతార హీరోయిన్ గా ఎంపికైనట్లు వస్తున్న వార్తలని గణేష్ ఖండించారు. ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదని అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?