అమెరికాలో ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్!

Published : Nov 18, 2019, 02:48 PM IST
అమెరికాలో ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్!

సారాంశం

గతంలో చాలా సార్లు ఈ జంట సోషల్ మీడియాలో సెల్ఫీలను పోస్ట్ చేశారు. ఆ విధంగా తమ బంధాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే విఘ్నేశ్ శివ పుట్టినరోజుని నయనతార గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. 

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాదితో ఆమె 35వ సంవత్సరంలోకిఅడుగుపెడుతోంది. ఈ పుట్టినరోజు వేడుకల కోసం నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ తో కలిసి అమెరికాలోని న్యూయార్క్ కి వెళ్లింది.

చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతూ.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిరంగ పరుచుకుంటూ ఉన్నారు. గతంలో చాలా సార్లు ఈ జంట సోషల్ మీడియాలో సెల్ఫీలను పోస్ట్ చేశారు. ఆ విధంగా తమ బంధాన్ని చాటుకుంటున్నారు.

Niharika Konidela: తెరపైకి మరోసారి మెగాడాటర్ పెళ్లి..!

ఇటీవలే విఘ్నేశ్ శివ పుట్టినరోజుని నయనతార గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయన్ బర్త్‌డే కోసం ఆమెతో కలిసి విఘ్నేష్ కూడా న్యూయార్క్ వెళ్లాడు.అక్కడి వీధుల్లో కలిసి తిరుగుతూ తీయించుకున్న ఫొటోలను విఘ్నేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

నయన్ తో ఉండటంలో తన ఆనందాన్ని ఈ దర్శకుడు పోస్ట్ లలో రాసుకొచ్చారు. ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నయనతార..  రజినీకాంత్ సరసన 'దర్బార్' సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?