'అమరావతి' రైతులకు సపోర్ట్ గా నారా రోహిత్ ఏం చేశాడో తెలుసా?

By AN TeluguFirst Published Jan 10, 2020, 1:32 PM IST
Highlights

గత కొద్ది కాలంగా సినిమాలు చేయకుండా విశ్రాంతిలో ఉన్న ఆయన సోషల్ మీడియా ద్వారా రైతులుకు సపోర్ట్ చేసారు. రైతుల పోరాటం వృథా కాదని, త్వరలోనే వారి పోరాటంలో కూడా నేను కూడా భాగస్వామిని అవుతానని అయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
 

గత కొద్ది రోజులుగా ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీళ్లేదని అమరావతిలోని రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.ఆ  రైతులకి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ మద్దతు తెలుపుతూ వస్తోంది. వారి తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపడుతోంది. అయితే సినిమా వాళ్ళెవరూ ఈ ఇష్యూలో ఇప్పటివరకూ కామెంట్ చేయటానికి ముందుకు రాలేదు. కావాలని ప్రభుత్వంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు నారా రోహిత్ రంగంలోకి దిగారు.

గత కొద్ది కాలంగా సినిమాలు చేయకుండా విశ్రాంతిలో ఉన్న ఆయన సోషల్ మీడియా ద్వారా రైతులుకు సపోర్ట్ చేసారు. రైతుల పోరాటం వృథా కాదని, త్వరలోనే వారి పోరాటంలో కూడా నేను కూడా భాగస్వామిని అవుతానని అయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

'జబర్దస్త్'కి పంచ్.. సూపర్ స్టార్ సినిమాలో హైపర్ ఆది టాపిక్!

ఆ పోస్ట్ లో "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను" అయన పోస్ట్ చేశారు.  

అయితే ఈ పోస్ట్ పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సోదరుడు కొడుకు నారా రోహిత్ కావటంతో ఈ తరహా సపోర్ట్ ఇచ్చారంటున్నారు. గతంలోనూ ఆయన తెలుగుదేశానికి మద్దతుగా ప్రచారం చేసారు. నారా రోహిత్ ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేరు. రైతులకు ఆయన చేసే సపోర్ట్ కు ఏ మేరకు స్పందన వస్తుందో చూడాలి.

click me!