గుర్తుపట్టలేని విధంగా నాని హీరోయిన్.. షాకింగ్ పిక్ వైరల్

Published : Oct 24, 2019, 05:34 PM ISTUpdated : Oct 24, 2019, 05:38 PM IST
గుర్తుపట్టలేని విధంగా నాని హీరోయిన్.. షాకింగ్ పిక్ వైరల్

సారాంశం

కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఈ ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. 

నాని సరసన నటించిన జెర్సీ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకుంది. జెర్సీ చిత్రం తర్వాత శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సౌత్ లో శ్రద్దా శ్రీనాథ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. 

శ్రద్దా శ్రీనాథ్ చివరగా ఆది సాయి కుమార్ సరసన జోడి చిత్రంలో నటించింది. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రద్దా శ్రీనాథ్ సినిమాల్లోకి రాక ముందు 2014లో తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజన్లందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోతో పాటు ఇటీవల తీసుకున్న మరో ఫోటోని కూడా శ్రద్దా శ్రీనాథ్ షేర్ చేసింది. 

ఈ ఫొటోలో శ్రద్దా శ్రీనాథ్ చాలా బొద్దుగా కనిపిస్తోంది. ఈ ఫోటో గురించి శ్రద్దా శ్రీనాథ్ సోషల్ మీడియాలో అభిమానులకు కొన్ని విషయాలు తెలియజేసింది. లా పూర్తయ్యాక ఉద్యోగం చేస్తున్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది. మంచి జీతం వస్తుండడంతో బట్టలకు, స్నేహితులతో టూర్ లకు డబ్బులు ఖర్చు చేసేదాన్ని. 

అలాగే ఆహార నియమాలు పాటించకుండా నచ్చిన ఫుడ్ తినేదాన్ని. దీనితో బొద్దుగా మారా. దీనితో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నా. మా ఇంటి దగ్గర్లోనే ఉన్న జిమ్ లో చేరి రోజుకు 40 నిమిషాల పాటు వ్యాయామం చేసేదాన్ని. దీనితో ఐదేళ్లలోనే 18 కేజీలు బరువు తగ్గి ఇలా నాజూగ్గా మారినట్లు శ్రద్దా శ్రీనాథ్ పేర్కొంది.   

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?