జెనీలియా ప్రచారం.. విజయఢంకా మోగించిన దేశ్ ముఖ్ సోదరులు!

By AN TeluguFirst Published Oct 24, 2019, 4:57 PM IST
Highlights

అమిత్​ దేశ్​ముఖ్​(కాంగ్రెస్​) లాతూర్​(పట్టణం)లో, ధీరజ్​ దేశ్​ముఖ్​ లాతూర్​(గ్రామీణం)లో నామినేషన్లు​ వేశారు. వీరి తరఫున ఎన్నికల్లో వారి సోదరుడు, ప్రముఖ హీరో రితేష్ దేశ్ ముఖ్, అతడి భార్య జెనీలియా ప్రచారం చేశారు. 

అక్టోబర్ 21న జరిగిన పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ మొదలయ్యింది. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది.

హర్యానాలో గత దఫా 77 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సరి అది దాదాపుగా 12శాతం తగ్గి 65 శాతం నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు కూడా పోటీ చేశారు. అమిత్​ దేశ్​ముఖ్​(కాంగ్రెస్​) లాతూర్​(పట్టణం)లో, ధీరజ్​ దేశ్​ముఖ్​ లాతూర్​(గ్రామీణం)లో నామినేషన్లు​ వేశారు. వీరి తరఫున ఎన్నికల్లో వారి సోదరుడు, ప్రముఖ హీరో రితేష్ దేశ్ ముఖ్, అతడి భార్య జెనీలియా ప్రచారం చేశారు. 

''జార్జ్ రెడ్డి'' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

వారు పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లి తమవంతుగా ప్రచారం చేశారు. పోలింగ్ రోజు రితేష్, జెనీలియాలతో పాటు మొత్తం కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక నేడు మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో మొదటి నుండి ముందంజలో ఉన్న దేశ్ ముఖ్ సోదరులు విజయకేతనం ఎగురవేశారు. త్వరలోనే జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన తన తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని అన్నారు. విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో ముఖ్యనేత. 1999 నుంచి 2008 మధ్యకాలంలో  రెండుసార్లు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2012లో అనారోగ్యంతో మరణించారు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే.. ఆయన కుమారుడు రితేశ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు.  ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన రితేశ్ 2012లో అప్పటికి స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతున్నజెనీలియాను పెళ్లిచేసుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి విలాస్ రావ్ మరణించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రితేష్ పోటీ చేస్తాడనే మాటలు బలంగా వినిపించాయి. కానీ రితేష్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదంటాడు. తన సోదరుల రాజకీయ ఎదుగుదలకు మాత్రం తన వంతు సహాయం చేస్తున్నాడు. 

click me!