బాలయ్యకు ఏంటీ తలనొప్పి.. బోయపాటికి మూవీకి బిగ్ ట్రబుల్!

By tirumala AN  |  First Published Jan 30, 2020, 7:55 AM IST

నందమూరి బాలకృష్ణకు గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ కొనసాగుతున్నట్లుంది. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బయోపిక్ లో వచ్చిన రెండు భాగాలూ ఆకట్టుకోలేకపోయాయి.


నందమూరి బాలకృష్ణకు గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ కొనసాగుతున్నట్లుంది. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బయోపిక్ లో వచ్చిన రెండు భాగాలూ ఆకట్టుకోలేకపోయాయి. గత ఏడాది డిసెంబర్ లో బాలయ్య నటించిన రూలర్ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. 

కానీ కొన్ని రోజుల క్రితం బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం ప్రారంభం కావడం నందమూరి అభిమానులకు ఊరటనిచ్చే అంశం. గత దశాబ్ద కాలంలో బాలయ్యకు ఎవరైనా బిగ్ హిట్ అందించారంటే అది బోయపాటి మాత్రమే. బోయపాటి దర్శత్వంలో తెరకెక్కిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో బాలయ్యని బోయపాటి పవర్ ఫుల్ గా చూపించాడు. 

Latest Videos

undefined

ఇంతటి క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతుంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉండడం సహజం. కానీ బాలయ్య, బోయపాటి ఫిలిం కు అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. రోజుకొక వార్త బయటకు వస్తూ అభిమానులని కలవరపెడుతోంది. 

ఇదిలా ఉండగా బాలయ్య, బోయపాటి చిత్రం మరింత ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ ని సినిమాటోగ్రాఫర్ గా ఎంపిక చేసుకున్నారు. బాలయ్య గత చిత్రం రూలర్ కి కూడా అతడే పనిచేశాడు. కానీ రామ్ ప్రసాద్ పట్ల బాలయ్య అసంతృప్తితో ఉండడంతో అతడిని తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం అతడికి ప్రత్యామ్నాయం దొరకడం లేదట. కొందరు సినిమాటోగ్రాఫర్స్ బాలయ్య, బోయపాటి చిత్రంపై అనాసక్తిని ప్రదర్శిస్తుంటే.. మరికొందరు బిజీగా ఉన్నారు. దీనితో బాలయ్య చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కొరత ఏర్పడింది. ఇక బడ్జెట్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. 

బాలయ్యకు హీరోయిన్లని ఎంపిక చేయడం కూడా బోయపాటికి తలనొప్పిగా మారింది. ఇటీవల ఈ చిత్రంలో కేథరిన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కేథరిన్ కోటి రూపాయల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం.. అందుకు నిర్మాత అంగీకరించకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు టాక్. ఇలా బాలయ్య చిత్రానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చూస్తుంటే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 

click me!