'RRR' స్పెషల్ లుక్.. ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోలు

By Prashanth M  |  First Published Jan 29, 2020, 8:23 PM IST

తెలుగు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో మిగతా బాషల వారు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు సంబందించిన  ఫస్ట్ లుక్ పై అంచనాలు మాములుగా లేవు.


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో మిగతా బాషల వారు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు సంబందించిన  ఫస్ట్ లుక్ పై అంచనాలు మాములుగా లేవు.

అయితే ఆ లుక్ వస్తే మెగా నందమూరి అభిమానులకు కిక్కు ఎంత గా వస్తుందో తెలియదు గాని.. న్యాచురల్ లుక్ లో RRR ప్రధాన తారాగణం ఒక్కసారిగా అదిరిపోయే కిక్కిచ్చారు. అజయ్ దేవ్ గన్ తో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. మరో ఫోటోలో రాజమౌళి కూడా వారితో ఉన్నాడు. రీసెంట్ గా RRR టీమ్ తో అజయ్ దేవ్ గన్ కలిసిన విషయం తెలిసిందే.

Latest Videos

నేటి నుంచి అజయ్ దేవగన్ రామ్ చరణ్ తారక్ లతో కలిసి ఒకే సీన్ లో నటించనున్నాడు. ఇకపోతే అజయ్ దేవగన్ పాత్రకు సంబందించిన ఒక రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజయ్ దేవగన్ మరొక స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పాత్ర కోసం కూడా జక్కన్న భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అజయ్ దేవగన్ క్లి సంబందించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 12కోట్ల మేర బడ్జెట్ నిర్ణయించినట్లు సమాచారం.  సింగిల్ షెడ్యూల్ లోనే ఆ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. అజయ్ దేవగన్ కనిపించేది కొద్దీ సేపే అయినప్పటికీ సినిమాలో ఆ పాత్రకు సంబందించిన ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి హీరోల స్టార్ డమ్ ని దృష్టిలో ఉంచుకొని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

click me!