మళ్ళీ మొదటికొచ్చిన 'బంగార్రాజు'.. సంక్రాంతి టార్గెట్?

prashanth musti   | Asianet News
Published : Jan 24, 2020, 12:11 PM IST
మళ్ళీ మొదటికొచ్చిన 'బంగార్రాజు'.. సంక్రాంతి టార్గెట్?

సారాంశం

గతంలో నాగార్జున ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు మన్మథుడు 2 ప్లాప్ తో మరో సినిమాను స్టార్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  ఎందుకంటె మన్మథుడు 2 నాగ్ మార్కెట్ ని గట్టి దెబ్బ కొట్టింది. 

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఎప్పుడు లేని విధంగా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు మన్మథుడు 2 ప్లాప్ తో మరో సినిమాను స్టార్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటె మన్మథుడు 2 నాగ్ మార్కెట్ ని గట్టి దెబ్బ కొట్టింది.

దీంతో నెక్స్ట్ సినిమాతో పోయిన మార్కెట్ ని ట్రాక్ లోకి తెచ్చుకోవాలని నాగ్ మంచి కాన్సెప్ట్ తో రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలైతే నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ తో రావాలని అనుకున్నాడు. బంగార్రాజు అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పై నాగ్ కి పూర్తి నమ్మకం కలిగే వరకు సెట్స్ పైకి వెళ్లకూదదని అనుకున్నాడు.  దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత ఏడాది నుంచి బంగార్రాజు కథ పట్టుకొని నాగ్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రీసెంట్ గా నాగార్జున సలహాల మేరకు సినిమా స్క్రీన్ ప్లే ను మార్చిన దర్శకుడు ఫైనల్ గా మెప్పించినట్లు తెలుస్తోంది.

సమ్మర్ లో సినిమాని మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు సినిమా ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు మళ్ళీ మొదలుకాబోతున్నట్లు టాక్ వస్తోంది. సమ్మర్ లో సినిమాను మొదలుపెట్టి 2020 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన 2016సంక్రాంతికి రిలీజై సాలిడ్ హిట్టందుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ తో అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. మరీ  ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?