'RRR'కి ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారంటే..?

By AN TeluguFirst Published Jan 24, 2020, 10:10 AM IST
Highlights

నిజానికి ఈ సినిమాకి దానయ్య నిర్మాత అయినా.. అన్ని వ్యవహారాలు దర్శకుడు రాజమౌళినే చూసుకుంటున్నారు. దానయ్యకి కొంత అమౌంట్ ఇచ్చి.. మిగిలిన లాభాలన్నీ రాజమౌళి తీసుకుంటాడని సమాచారం. 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'RRR' సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా కోసం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ఇంత మొత్తాన్ని నిర్మాత దానయ్య ఎలా సర్దుబాటు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనికి సమాధానంగా చాలా విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి దానయ్య నిర్మాత అయినా.. అన్ని వ్యవహారాలు దర్శకుడు రాజమౌళినే చూసుకుంటున్నారు. దానయ్యకి కొంత అమౌంట్ ఇచ్చి.. మిగిలిన లాభాలన్నీ రాజమౌళి తీసుకుంటాడని సమాచారం. రాజమౌళినే సినిమాకి ఫైనాన్స్ కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

RRR అజయ్ దేవగన్ రోల్.. జక్కన్న లెక్కలు మాములుగా లేవు!

బాహుబలి పార్ట్ 1కి ఈనాడు రామోజీరావు ఫైనాన్స్ చేస్తే.. బాహుబలి పార్ట్ 2కి మ్యాట్రిక్స్ ప్రసాద్ తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేశారు. ఈసారి కూడా తక్కువ వడ్డీకి ప్రయత్నించారు.  బడా ఫైనాన్షియర్ సత్య రంగయ్య రూపాయన్నర వడ్డీకి ఫైనాన్స్ చేయడానికి సముఖత చూపించలేదని సమాచారం. దాంతో మళ్లీ మ్యాట్రిక్స్ ప్రసాద్ ముందుకొచ్చి ఫైనాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఆయనొక కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ రాజమౌళి పేరు మీదనే ఇస్తానని అనడంతో దానికి రాజమౌళి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అంగీకారం కుదిరిన తరువాత ఫైనాన్స్ లభించినట్లు తెలుస్తోంది.

దాని కారణంగా ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత దానయ్య అయినప్పటికీ.. లాభాల్లో మేజర్ షేర్ మాత్రం రాజమౌళి అండ్ కో దే అని తెలుస్తోంది. ఇప్పుడు సినిమా మార్కెటింగ్ అంతా కూడా రాజమౌళి కుమారుడు కార్తిక్ చూసుకుంటున్నాడు. ఒక్క ఆంధ్ర ఏరియానే వంద కోట్ల రేషియోలో చెబుతున్నారు. అంత మొత్తం చెబుతున్నా.. ఐదారుగురు పోటీ పడుతుండడం విశేషం. 


 

click me!