'జబర్దస్త్' పై నాగబాబు డైరక్ట్ వార్

prashanth musti   | Asianet News
Published : Dec 24, 2019, 05:50 PM IST
'జబర్దస్త్' పై నాగబాబు డైరక్ట్ వార్

సారాంశం

 జబర్దస్త్ పోగ్రాంకు డైరక్ట్ ఛాలెంజ్ వదిలబోతున్నారు నాగబాబు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన చేసారు. దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు రీసెంట్ గా ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా పోగ్రాం స్టార్ట్ చేసారు.

ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ పోగ్రాంకు డైరక్ట్ ఛాలెంజ్ వదిలబోతున్నారు నాగబాబు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన చేసారు. దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు రీసెంట్ గా ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా పోగ్రాం స్టార్ట్ చేసారు.

నాగబాబుతో పాటు ఆయన తో పాటు జబర్దస్ లో చేసిన కమిడయన్స్  చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధనరాజ్, వేణులు అదిరింది షోకి టీం లీడర్స్‌గా  చేసారు. అలాగే.. జబర్దస్త్ షో నుండి ముందే బయటకు వచ్చేసిన నితిన్ భరత్‌లు అదిరింది షోని డైరెక్ట్ చేస్తున్నారు. వీరందరితో కలిసి .. జీ తెలుగులో ఆదివారం నాడు ‘అదిరింది’ షో టెలికాస్ట్ అయ్యింది.  అయితే అదే సమయంలోలో ఈటీవీలో జబర్దస్త్ షోని ప్రసారం చేయడంపై నాగబాబు ఫైర్ అవుతూ ఓ వీడియో వదిలారు.

ఆ వీడియోలో తాము జబర్దస్త్ కు పోటీగా రావాలని అనుకోలేదని, కానీ తమ కార్యక్రమానికి పోటీగా వాళ్లు జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ వేయడంతో కయ్యానికి కాలుదువ్వారని ఆరోపిస్తూ మాట్లాడారు.  అంతేకాకుండా..  జబర్దస్త్ ప్రసారమయ్యే అసలైన స్లాట్స్ లోనే ఇకపై అదిరింది కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు జీ తెలుగు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఒరిజినల్ జబర్దస్త్ కు పోటీగా అదిరింది ప్రొగ్రామ్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

దాంతో డైరక్ట్ గా వార్ ప్రకటించినట్లైంి.  అలాగే  జబర్దస్త్ ఎపిసోడ్స్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ ఉండటంతో దానికి పోటీగా... అదిరింది ఎపిసోడ్లను కూడా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు.వాస్తవానికి జీ తెలుగు కార్యక్రమాలేవీ యూట్యూబ్ లో పెట్టరు., వాళ్ల  జీ5 అనే యాప్ లో ఇవన్నీ పెడుతూంటారు.  

కానీ కేవలం జబర్దస్త్ కు పోటీ ఇవ్వడం కోసం అదిరింది ప్రొగ్రామ్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అఫీషియల్ గా పోటీకి దిగారన్నమాట. దాంతో టీవి చూసేవాళ్లు..ఈ పోగ్రాం లు ఫాలో అయ్యేవాళ్లు..జబర్దస్త్ ను అదిరింది కార్యక్రమం ఎన్ని వారాల్లో అధిగమిస్తుందో చూడాలంటున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?