'అల వైకుంఠపురములో'.. బుట్ట బొమ్మ సాంగ్!

By AN TeluguFirst Published Dec 24, 2019, 5:01 PM IST
Highlights

'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తాజాగా పూర్తి లిరిక్స్ తో కూడిన పాటను విడుదల చేశారు. ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. 

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కలిసి మూడో సారి చేస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి నాలుగో టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తాజాగా పూర్తి లిరిక్స్ తో కూడిన పాటను విడుదల చేశారు.

ఈ పాటకి  రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు.

హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 

click me!