నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

By Prashanth MFirst Published Feb 14, 2020, 3:28 PM IST
Highlights

నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు.

అక్కినేని యువ హీరో నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రివ్యూ ని విడుదల చేశారు. ఏయ్ పిల్లా అని సాగే ఈ సాంగ్ తో శేఖర్ కమ్ముల మరోసారి తన మేకింగ్ టాలెంట్ ని నిరూపించాడు.

ఇక సాంగ్ లో సాయి పల్లవి చైతన్యపై పడి పడి ముద్దు ఇవ్వడం న్యాచురల్ అండ్ క్యూట్ నెస్ గా కనిపిస్తోంది. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ కరెక్ట్ గా సెట్టయినట్లు అర్ధమవుతోంది. హీరో,హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీకి చాలా మంచి రెస్సాన్స్ వస్తోంది. శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని సాంగ్ లో కలిగించారు.

కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్ ’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది.  ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది.

సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

click me!