వినాయక్ కి మరో దెబ్బ.. సీనయ్య లేనట్లేనా?

prashanth musti   | Asianet News
Published : Feb 14, 2020, 02:58 PM IST
వినాయక్ కి మరో దెబ్బ.. సీనయ్య లేనట్లేనా?

సారాంశం

సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ హీరోగా మొదటి సినిమా 'సీనయ్య'  సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ హీరోగా మొదటి సినిమా 'సీనయ్య'  సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఆ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు అన్నప్పుడే సినిమాపై అంచనాల డోస్ పెరిగింది. ఇక వినాయక్ లాంటి దర్శకుడిని ఎవరు ఊహించని విధంగా కథానాయకుడిగా సెలెక్ట్ చేసుకోవడం మరింత హైప్ ని క్రియేట్ చేసింది. అలాగే సినిమా లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎందుకో అవుట్ ఫుట్ పై దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశాడట. దర్శకుడు నరసింహా కూడా వినాయక్ రోల్ పై నమ్మకంగా లేకపోవడంతో సినిమాని ఆపేసినట్లు తెలుస్తోంది.  మొన్నటివరకు సినిమాకు జస్ట్ బ్రేక్ అన్నట్లు టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు అసలు సినిమానే ఆగిపోయిందని ఇంకా డబ్బు వృధా చేయడం కుదరదని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడిగా ఫెయిల్ అవుతున్న తరుణంలో కథానాయకుడిగా క్లిక్కవుతాడని అనుకున్న వినాయక్ కి మరో దెబ్బ తగిలింది. మరీ ఇప్పుడు వినాయక్ ఎటు వైపు బిజీ అవుతాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?