'మనమే ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాం'.. మోహన్ బాబు సంచలన నిర్ణయం

By tirumala ANFirst Published Mar 17, 2020, 6:18 PM IST
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా కొన్ని దేశాల్లో అన్ని రంగాలు స్తంభించిపోయాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా కొన్ని దేశాల్లో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఇండియాలో లోకూడా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో సినిమా థియేటర్స్ ని, కల్యాణ మంటపాలని పలు రాష్ట్రాల్లో మూసేశారు. జనాలు ఎక్కువగా తిరిగే షాపింగ్ మాల్స్, క్లబ్బులని కూడా మూసివేయడం జరిగింది. 

కరోనా ప్రభావం ఎక్కువవుతుండడంతో సోషల్ మీడియా వేడిగా టాలీవుడ్ ప్రముఖులు కూడా అవేర్నెస్ మొదలు పెట్టారు. మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, చిరంజీవి ఇపప్పటికే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాజాగా ఆ జాబితాలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు. 

కరోనా వైరస్ ఎక్కువవుతున్న తరుణంలో మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న మోహన్ బాబు తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ప్రతి ఏటా మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో ఘనంగా జరుగుతాయి. 

ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

కానీ కరోనా కారణంగా తాజా జన్మదిన వేడుకలు జరపవద్దని, ఎవరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని మోహన్ బాబు విన్నవించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. భగవంతుడు ఇచ్చిన పంచభూతాలని సరిగా వినియోగించుకోకుండా మనమే ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాం. 

కరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రజలు సమూహంగా ఉంటే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. నలుగురూ బావుంటేనే మనం బావునట్లు. కావున తాను జన్మదిన వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు. 

ఆత్మీయ విన్నపం... pic.twitter.com/JRnfYWdgUS

— Mohan Babu M (@themohanbabu)
click me!