మోహన్ బాబు, విష్ణు గొప్ప నిర్ణయం.. 8 గ్రామాలని దత్తత తీసుకున్న తండ్రీ కొడుకులు!

By tirumala ANFirst Published Apr 7, 2020, 5:24 PM IST
Highlights

ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్ రూపంలో పెను విపత్తుని ఎదుర్కొంటోంది. లక్షలాది ప్రజలు కరోనా భారీన పడుతున్నారు. వేలసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్ రూపంలో పెను విపత్తుని ఎదుర్కొంటోంది. లక్షలాది ప్రజలు కరోనా భారీన పడుతున్నారు. వేలసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఓ పక్క కరోనా ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

కరోనా వైరస్ నిర్మూలనకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు నిత్యావసరాల కోసం అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు పూత గడవడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు విరాళాలతో ఆపన్న హస్తం అందిస్తున్నారు. 

ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

త్రో బ్యాక్: త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీ.. సినిమా తరహాలో మ్యారేజ్

తండ్రి కొడుకులు ఇద్దరూ చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలని దత్తత తీసుకున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ఆయా గ్రామాలకు భోజనం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల్ని సరఫరా చేయనున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు నిర్ణయంపై ప్రశంసలు దక్కుతున్నాయి. 

click me!