మెగాస్టార్ సర్.. మెగాస్టార్ అంతే.. ట్రంప్ అయినా, మోడీ అయినా ఒక్కటే ..

By tirumala ANFirst Published Apr 22, 2020, 9:45 AM IST
Highlights

గొప్పవారిగా ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. అవి తనలో అణువణువునా కలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. అందువల్లే చిరు సినీ రంగంలో శిఖరానికి చేరుకున్నారు.

గొప్పవారిగా ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. అవి తనలో అణువణువునా కలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. అందువల్లే చిరు సినీ రంగంలో శిఖరానికి చేరుకున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి కుర్రాళ్లతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలు చిరు తన ఎనర్జీ సీక్రెట్ ని వివరించారు.  లాక్ డౌన్ సందర్భంగా చిరు ఇంట్లో ఖాళీగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎనర్జీ అనేది శరీరానికి సంబంధించినది కాదని చిరు అన్నారు. మనసు ఉత్సాహంగా ఉంటే వయసు కేవలం నంబర్ మాత్రమే అవుతుందని చిరు తెలిపారు. 

మనం మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన ముఖంలోని కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మనసుని యంగ్ గా ఉంచుకోవాలి అని చిరు అన్నారు. తానూ చిన్నపిల్లలతో కలసినప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోతానని.. ఏజ్ వాళ్ళని కలసినప్పుడు ఏజ్ వాళ్ళలా మారిపోతానని చిరు అన్నారు. 

ఇక తాను నిత్యం కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటానని చిరు అన్నారు. ఎలాంటి నెరిగిటివిటీని దగ్గరకు రానీయను. నెగిటివిట మనలో ఉంటే ముఖంలో ముడతలు కనిపిస్తాయి అని చిరు అన్నారు. ఆ విధంగా తనకు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. 

ఇక సమయపాలన విషయంలో కూడా మెగాస్టార్ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. చాలా మంది తమకు సమయం దొరకడం లేదు అనే మాటలు చెబుతుంటారు. అవి దొంగ ఎత్తుగడలు. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవికి రోజుకు 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది అని చిరు అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అయినా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అయినా రోజుకు 24 గంటల సమయం మాత్రమే అని చిరు తెలిపారు. 

కంగారు పెట్టేసావు కదయ్యా కొరటాల

చాలా మంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సమయం వృధా చేసుకుంటున్నారు. రాకెట్ ప్రయోగాల్లో ప్రతి సెకను అత్యంత కీలకం అని చిరు అన్నారు. అలాంటి సమయాన్ని వృధా చేయకూడదని చిరు చెప్పుకొచ్చాడు. దశాబ్దాలుగా చరియు బిజీ బిజీ షెడ్యూల్స్ తో వందలాది సినిమాల్లో నటించారు. బహుశా అందుకే సమయపాలన విషయంలో చిరు ఇంత పక్కాగా ఉంటారు. అందుకే అభిమానులు.. మెగాస్టార్ సర్.. మెగాస్టార్ అంతే అని అంటున్నారు. 

click me!