14 వేలమంది రోడ్డున పడతారు.. క్లియర్ గా చెప్పిన చిరంజీవి.. రాజమౌళి ఐడియా ఇదే

By tirumala ANFirst Published May 21, 2020, 12:31 PM IST
Highlights

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల్న ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. కొన్ని షరతులతో వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల్న ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. కొన్ని షరతులతో వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ సినిమా షూటింగ్స్ కూడా గత రెండు నెలలుగా ఆగిపోయిన పరిస్థితి. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న తరుణంలో షూటింగ్స్ కూడా పునఃప్రారంభించడానికి చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులంతా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలసి మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశం అయ్యారు. 

పంచెకట్టుతో రానా, మెరిసేటి చీరలో మిహీకా.. ఎంగేజ్మెంట్ ఫోటోస్

ఈ సమావేశంలో పలు అంశాలు  చర్చకు వచ్చాయి.  ఈ సమావేశానికి చిరంజీవి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. షూటింగ్స్ తిరిగి ప్రారంభించాల్సిన ఆవశ్యకతని చిరంజీవి చాలా క్లియర్ గా వివరించారు. 

ప్రస్తుతం విడుదలకు 20 సినిమాల వరకు సిద్ధంగా ఉన్నాయి. నాలుగైదు బడా చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కేవలం ఆయా చిత్రాల నిర్మాతల కోసమే కాదు.. 14 వేల మంది సినీ కార్మికుల కోసం షూటింగ్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని చిరంజీవి అన్నారు. మరికొంత కాలం షూటింగ్స్ జరగకపోతే రెక్కాడితే కానీ డొక్కాడని 14 వేలమంది సినీ కార్మికులు రోడ్డున పడతారు అని చిరంజీవి వివరించారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్ ఎలా జరుపుతామో రాజమౌళి వివరించారు.  పరిస్థితి చక్కబడే వరకు వందలమంది పాల్గొనే షూటింగ్స్ కాకుండా చిన్న సన్నివేశాలు తెరకెక్కిస్తామని అన్నారు. సెట్స్ లో సిబ్బందిని యూనిట్స్ గా విభజించి జాగ్రత్తలు తీసుకుంటాం అని రాజమౌళి మంత్రి తలసానితో పేర్కొన్నారు. 

click me!