థియేటర్లు తెరుచుకునేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

By Satish ReddyFirst Published Apr 20, 2020, 12:51 PM IST
Highlights

తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా ప్రభావం సినీ పరిశ్రమ మీద ఎలా ఉంటుందో తన అంచనాను ఓ మీడియా ఇంటర్వ్యూలో వివరించాడు. చిరు అంచనా ప్రకారం పరిస్థితి సమీప భవిష్యత్తులో అనుకూలించే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది.

కరోనా భయంతో ప్రపంచమంతా లాక్ డౌన్‌ అయిపోయింది. ఈ ప్రభావంతో ప్రతీ రంగం కుదేళయిపోతుంది. దీంతో వినోద రంగం కూడా పూర్తిగా షట్‌ డౌన్‌ అయ్యింది. సినిమాలకు సంబంధించి షూటింగ్ లు, రిలీజ్‌, థియేటర్లు, ఇతర అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. దీంతో లక్షలాది మంది ఉపాది కోల్పోయారు. తిరిగి పరిస్థితి ఎప్పటికి సర్దుకుంటుంది అన్న విషయాన్ని కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంతో సినీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది.

ఇప్పటి వరకు లాక్ డౌన్‌ తరువాత కొద్ది రోజుల్లోనే పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు. కానీ సినీ ప్రముఖల ఆలోచన మాత్రం అలా లేదని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కరోనా ప్రభావం సినీ పరిశ్రమ మీద ఎలా ఉంటుందో తన అంచనాను ఓ మీడియా ఇంటర్వ్యూలో వివరించాడు. చిరు అంచనా ప్రకారం పరిస్థితి సమీప భవిష్యత్తులో అనుకూలించే పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది.

లాక్‌ డైన్‌ మే 7 ముగిసిన థియేటర్లు తెరుచుకునేందుకు చాలా కాలం పడుతుందని చిరు అంచనా వేస్తున్నాడు. ప్రభుత్వ దృష్టిలో సినిమా అనేది చివరి ప్రయారిటీ అయి ఉంటుంది కనుక  సమీప కాలంలో థియేటర్లు తెరచుకోవని ఆయన భావిస్తున్నాడు. ఎంత లేదన్నా సినిమా థియేటర్లు తెరచుకోవడానికి నవంబర్‌ వరకు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నాడు చిరు. అదే నిజమైతే ఈ ఏడాది అంతా సినిమాల రంగంలో పనులు ఆగిపోయినట్టే. అయితే షూటింగ్‌లు మాత్రం మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం అవుతాయని అంచనా వేస్తున్నాడు చిరు.

click me!