ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో ఉపాసన.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

By tirumala ANFirst Published Apr 20, 2020, 12:32 PM IST
Highlights

మెగా కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఉపాసన అభిమానులకు రాంచరణ్ లేటెస్ట్ సంగతులు అందించడమే కాదు.. ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా అందిస్తోంది.

మెగా కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఉపాసన అభిమానులకు రాంచరణ్ లేటెస్ట్ సంగతులు అందించడమే కాదు.. ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా అందిస్తోంది. దీనితో రోజు రోజుకు ఉపాసనకు నెట్టింట అభిమానులు పెరుగుతున్నారు. 

తాజాగా ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి అందరి హృదయాలు గెలుచుకుంటోంది. భారతీయుల టాయిలెట్ పొజిషన్ ఉపాసన కూర్చుని ఉన్న పిక్ ని షేర్ చేసింది. ఇలా కూర్చోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని ఉపాసన అంటోంది. 

భారతీయుల టాయిలెట్ పొజిషన్ లో చాలా లోపాలు ఉన్నాయని, అందువల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతాయని గతంలో విమర్శలు వచ్చాయి. కానీ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఆరోగ్యానికి చాలా బెటర్ అని ఉపాసన అంటోంది. 

ఇలా రోజుకు ఐదు నిమిషాల పాటు కూర్చోవడం వల్ల కాళ్ల ఎముకలు గట్టిపడుతాయని ఉపాసన తెలిపింది. అదే విధంగా చిన్న పేగు, పెద్ద పేగులో కదలికలు సులభంగా ఏర్పడుతాయి. మోకాలు 90 డిగ్రీల వరకు వంగుతుంది. దీని వల్ల మోకాలికి అవసరమైన సైనోవియల్ ఫ్లూయిడ్ పూర్తిగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఎముకలు త్వరగా అరిగిపోవు అని ఉపాసన చెబుతోంది. ఉపాసన చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

Looks so easy but so tough to sit in this position for loads of people living in the city.
can u sit in the Indian toilet position for 5 min ?

By may 3rd i want to be able to do it ! https://t.co/4muqoZPHr7 pic.twitter.com/NETSFGokMw

— Upasana Konidela (@upasanakonidela)

 

click me!