మోహన్ బాబు బర్త్ డే: వైరల్ అవుతున్న మనోజ్ పోస్ట్.. చిరంజీవి సెటైర్

Published : Mar 19, 2020, 03:21 PM IST
మోహన్ బాబు బర్త్ డే: వైరల్ అవుతున్న మనోజ్ పోస్ట్.. చిరంజీవి సెటైర్

సారాంశం

కలక్షన్ కింగ్ మోహన్ బాబు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. మోహన్ బాబు తన విలక్షణ నటనతో లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్నారు.

కలక్షన్ కింగ్ మోహన్ బాబు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. మోహన్ బాబు తన విలక్షణ నటనతో లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తన తనయులు నటులుగా రాణిస్తున్నప్పటికీ మోహన్ బాబు నటుడిగా కొనసాగుతున్నారు. 

పర్సనల్ లైఫ్ కెలుకుతారు.. ఒక్క శాతం కూడా భరించను : రెజీనా

మోహన్ బాబు నేడు తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా మోహన్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్ తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ సంస్థలో వైభవంగా జరుగుతాయి. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మోహన్ బాబు తన జన్మదిన  వేడుకల్ని రద్దు చేసుకున్నారు. 

కానీ సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోహన్ బాబు తనయులు మంచు, విష్ణు, మనోజ్, కుమార్తె మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తాం తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

మంచు మనోజ్ టీనేజ్ లో ఉన్న సమయంలో తన తండ్రి చంకనెక్కి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది . 'మై డాడ్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న అని మనోజ్ పోస్ట్ చేశాడు. 

ఇక మంచు విష్ణు కూడా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పలువురు సెలెబ్రిటీలు మోహన్ బాబుని ప్రశంసిస్తున్న వీడియో షేర్ చేశాడు. ఈ ఈ వీడియోలో మోహన్ బాబుని బాలయ్య, ఏఎన్నార్, స్వర్గీయ ఎన్టీఆర్ తదితరులు ప్రశంసిస్తున్నారు. ఇక చిరంజీవి మోహన్ బాబుని పెద్దాయన అంటూ ఫన్నీ సెటైర్ వేస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. 

ఇక మోహన్ బాబు తనయి మంచు లక్ష్మి తన తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేసింది. తన తండ్రిని వన్ మ్యాన్ ఆర్మీ గా అభివర్ణించింది.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?