
Ileana D'Cruz: ప్రముఖ నటి ఇలియానా పండంటి కొడుక్కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఆగస్టు 1వ తేదీనే ఆమె ప్రసవించినట్టు చెప్పింది. అయితే, శనివారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఆ బుడ్డోడికి పేరు కూడా పెట్టేసింది.
ఆ బేబీ బాయ్ పేరు కోవా ఫీనిక్స్ డోలాన్ అని ఇలియానా తెలిపింది. కోవా ఫీనిక్స్ డోలాన్ ఫొటోను కూడా ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోతో పాటు ఆమె ఓ ఎమోషనల్ నోట్ పోస్టు చేసింది.
‘ఈ ప్రపంచంలోకి మా బేబీ బాయ్‌ను ఆహ్వానించడంలో తాము ఎంత సంతోషంగా ఉన్నామో పదాల్లో చెప్పలేం. మా మనసులు ఆనందంతో నిండిపోయాయి’ అని ఇలియానా రాసింది.
ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్ అయింది. పలువురు నటులు ఆమెపై అభినందనలు కురిపించారు. అథియా శెట్టి, నర్గిస్ ఫక్రీ, సోఫీ చౌదరి సహా పలువురు నటీమణులు కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేశారు.
Also Read: ట్రోలింగ్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన సుశ్మితా సేన్? ‘గోల్డ్ డిగ్గర్’ కామెంట్స్ పై ఘాటు రిప్లై
ఫ్యాన్స్ కూడా తెగ ఆనంద పడ్డారు. ఇటీవలి కాలంలో అనుష్క శర్మ, అలియా భట్, ప్రియాంక చోప్రా జోన్స్ వంటి నటీమణులు తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో కనిపించకుండా చూపించారు. లేదా బ్లర్ చేశారు. కానీ, ఇలియానా మాత్రం తన బిడ్డ ముఖాన్ని చూపిస్తూ ఫొటో పెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇంకా థ్రిల్ అయ్యారు.