బెంగుళూరులోనూ మహేష్ వ్యాపార విస్తరణ, వివరాలు

By Surya PrakashFirst Published Apr 26, 2023, 1:15 PM IST
Highlights

బెంగుళూరు వారికి వరల్డ్ క్లాస్ సినిమా ఎక్సపీరియన్స్ మహేష్ AMB సినిమాస్ తో ఇవ్వనున్నారు. బెంగుళూరులో మల్టిప్లెక్స్ కల్చర్ కి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అక్కడ సూపర్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. 


సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలోనూ బిజినెస్ మ్యాన్ ని అనిపించుకుంటున్నారు. నటనతో పాటుగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే మరోపక్క వ్యాపార రంగంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ , హోటల్ బిజినెస్‌లలో ప్రవేశించిన మహేష్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు.

 ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ స్టార్ట్ చేసిన మహేష్.అది సక్సెస్ అవటంతో బెంగుళూరులోనూ  AMB సినిమాస్ ని ప్రారంభించబోతున్నారు. గాంధీనగర్, బెంగుళూరు లో కనస్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది.  హైదరాబాద్ కన్నా అదిరిపోయే టెక్నాలిజీతో అక్కడ మల్టిఫ్లెక్స్  నిర్మిస్తున్నారు. బెంగుళూరు వారికి వరల్డ్ క్లాస్ సినిమా ఎక్సపీరియన్స్ మహేష్ AMB సినిమాస్ తో ఇవ్వనున్నారు. బెంగుళూరులో మల్టిప్లెక్స్ కల్చర్ కి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అక్కడ సూపర్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. 

Latest Videos

మరో ప్రక్క వైజాగ్ సిటీలోనూ ఏషియన్ సునీల్ AMB మల్టిప్లెక్స్ లు ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ లొకేషన్స్ తో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ AMB చైన్ ని విస్తరించే వ్యూహంలో ఉన్నారు.

మరో ప్రక్క  అదే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసారు. AN రెస్టారెంట్ అనే పేరుతో   అందుబాటులోకి వచ్చిన ఈ రెస్టారెంట్ కు భార్య నమ్రతా పేరుని పెట్టాడు మహేష్ బాబు. ‘AN’లో N అంటే నమ్రతా.ఈ రెస్టారెంట్ హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని టీఆర్ఎస్ భవనం పక్కన ఉంది.

ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రం షూటింగ్  వేగంగా జరుగుతోంది.  ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర టీమ్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

click me!