న్యూయార్క్‌లో నమ్రతా బర్త్‌డే సెలబ్రేషన్స్!

Published : Jan 22, 2020, 04:25 PM IST
న్యూయార్క్‌లో నమ్రతా బర్త్‌డే సెలబ్రేషన్స్!

సారాంశం

తన భార్య పుట్టినరోజు పురస్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 'ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు.  

నటిగా కంటే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా అందరికీ సుపరిచితురాలైంది నమ్రతా. నేడు ఆమె తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది నమ్రత. తన భార్య పుట్టినరోజు పురస్కరించుకొని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

'ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు.  ఆయన అభిమానులు సైతం ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టాలీవుడ్ టాప్ 10 మూవీస్.. మహేష్, బన్నీ బిగ్ ఫైట్

ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సక్సెస్ కావడంతో మహేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ తన పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?