ఓవైసీపై షాకింగ్ కామెంట్స్.. మోడీ సామాన్యుడు కాదు అంటూ హీరోయిన్ పోస్ట్!

By tirumala ANFirst Published Feb 10, 2020, 9:09 PM IST
Highlights

హీరోయిన్ మాధవీలత సినిమా పరంగానే కాక రాజకీయ, సామాజిక అంశాలతో కూడా పాపులర్ అవుతోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం, నటీమణులపై వేధింపులు లాంటి అంశాలతో మాధవీలత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనంతరం బిజెపి పార్టీలో కూడా చేరింది. 

తాజాగా మాధవీలత ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అక్బరుద్దీన్ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం నిధుల్ని కోరారు. దీనితో మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఈమేరకు మాధవిలత ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. 'మార్పు మొదలైంది. మోదీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయ్యింది. అయ్య బాబోయ్‌ మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు. నిన్న జనగణమన పాడారు. నేడు దేవాలయాలు బాగుచేయాలంటున్నారు. మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా' అని మాధవీలత కామెంట్స్ చేసింది. 

మై గాడ్.. అచ్చు సమంత లాగే ఉంది.. ఎవరీ హాట్ బ్యూటీ

మాధవీలత ఓ ముస్లిం నేతపై ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఇతర మతాలని గౌరవించడం లాంటి మార్పులు మొదలయ్యాయని మాధవీలత పేర్కొంది. 

click me!