మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

Published : Jan 02, 2020, 01:41 PM ISTUpdated : Jan 02, 2020, 04:50 PM IST
మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

సారాంశం

తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. 

'మా' అసోసియేషన్ లో ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నరేష్, రాజశేఖర్ లు ఒకరినొకరు దూషించుకుంటూ మీడియాకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది.

ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా.. స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో నటుడు రాజశేఖర్ పదే పదే  అడ్డుపడ్డారు.

చిరు, మోహన్ బాబు కాళ్లు మొక్కి.. స్టేజ్ దిగివెళ్లిపోయిన రాజశేఖర్

చిరంజీవి 'మా' అసోసియేషన్ ని అభివృద్ధి పరిచే దిశగా నడిపించాలని మాట్లాడుతున్న సందర్భంలో రాజశేఖర్ కల్పించుకుంటూ చిరు ప్రసంగానికి అడ్డుపడ్డారు. చిరు మాటలను తప్పుగా తీసుకున్న రాజశేఖర్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుచూరి మాట్లాడుతుండగా ఆయన వద్ద నుండి మైక్ లాగేసుకున్నాడు రాజశేఖర్.

అనంతరం.. ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంటుందని.. కప్పి పడితే నిప్పు దాగదని అన్నారు. రాజశేఖర్ ప్రవర్తనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజశేఖర్ స్టేజ్ పై నుండి దిగిపోయిన తరువాత.. చిరు మైక్ తీసుకొని.. ప్రోటోకాల్ పాటించని వ్యక్తుల గురించి ఏం మాట్లాడలేను.. నా మాటకి విలువే ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు.  

మైక్ లాక్కోవడం ఎంతవరకు సంస్కారం.. పథకం ప్రకారమే రసాభాస చేసేందుకు రాజశేఖర్ యత్నించారు అంటూ రాజశేఖర్ పై చిరు ఫైర్ అయ్యారు. రాజశేఖర్ ఇలా ప్రవర్తించినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?