''బాలయ్య అసిస్టెంట్లను మాత్రమే కొడతారు..''

Published : Dec 19, 2019, 03:54 PM ISTUpdated : Dec 19, 2019, 03:57 PM IST
''బాలయ్య అసిస్టెంట్లను మాత్రమే కొడతారు..''

సారాంశం

ఈ క్రమంలో బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం గురించి చెప్పారు. వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైనప్పుడు, ముహూర్తం షాట్ వీడియోల్లో ఒకటి బయటకి వచ్చి వార్తల్లో నిలిచింది. తన అసిస్టెంట్ ఒకరిపై బాలకృష్ణ చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో ఉంది.

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి కేఎస్ రవికుమార్ డైరెక్టర్ గా పని చేశారు. గతంలో వీరి కాంబినేషన్ లో 'జై సింహా' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది.

కానీ మరీ గుర్తుండిపోయే సినిమా అయితే కాదు.. అయినప్పటికీ వీరి కాంబినేషన్ లో సినిమా రిపీట్ అయింది. ఈసారి కూడా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కేఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు.

బ్రేకింగ్: బాలకృష్ణ డైరెక్టర్ గా 'ఆదిత్య 999'!

ఈ క్రమంలో బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం గురించి చెప్పారు. వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైనప్పుడు, ముహూర్తం షాట్ వీడియోల్లో ఒకటి బయటకి వచ్చి వార్తల్లో నిలిచింది. తన అసిస్టెంట్ ఒకరిపై బాలకృష్ణ చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో ఉంది. తన అభిమానులు చాలా మంది మీద బాలకృష్ణ వివిధ సందర్భాల్లో చేయి చేసుకున్నారు.

అలానే తన అసిస్టెంట్ మీద కూడా బాలయ్య తన ప్రతాపం చూపించారు. ఆ తరువాత కూడా బాలకృష్ణ పలు సందర్భాల్లో తన దురుసుతనాన్ని చూపించారు. బాలయ్య ప్రవర్తన చూసిన వారికి ఆయన తన అభిమానులు, అసిస్టెంట్ ల మీదే కాకుండా సినిమా కోసం పని చేసే వారితో కూడా ఇలానే వ్యవహరిస్తారా..? అనే సందేహాలు రాకమానవు.

ఈ క్రమంలో దర్శకుడు రవికుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 'తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలయ్య వారిపై కోపగించుకుంటారు' అంటూ రవికుమార్ చెప్పారు. అంటే బాలయ్య చేయిదురుసుతనం టెక్నీషియన్ల మీద ఉండదన్నట్లుగా రవికుమార్ చెప్పుకొచ్చారు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?