#NMBK:‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Oct 11, 2022, 08:47 AM IST
 #NMBK:‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

కిరణ్ అబ్బవరం...ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో తనేంటో.. తన సత్తా ఏంటో చాటాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా ఆశించినంత స్థాయిలో విజయం దక్కలేదు. తర్వాత ఆయన తీసిన  చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. 

శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమైన సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' . 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాలతో యువతను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరో. అతని చివరి రెండు సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా కూడా అదే పరిస్దితి. డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడీ చిత్రం ఓటీటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు రైట్స్ తీసుకున్న ఆహా వారు ప్రకటన చేసారు.

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమా అక్టోబర్ 13న ఆహా ఓటిటిలో ప్రీమియర్ కానుంది. థియేటర్ లో పెద్దగా జనం చూడలేదు కాబట్టి ఈ చిత్రం ఓటిటిలో బాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.  ఇక ఈ చిత్రం కథ ఏమిటంటే....
  
ఈ కథలో హీరోయిన్ అయిన  తేజు (సంజన ఆనంద్) ఒంటిరిగా ఉంటూంటుంది. అదే పనిగా  తాగుతూంటుంది. ఆమెను తన క్యాబ్ లో రోజూ ఆఫీస్ నుంచి  డ్రాప్ చేస్తూంటాడు మన హీరో వివేక్ (కిరణ్ అబ్బవరం). అతను  ఓ   క్యాబ్ డ్రైవర్ . రెగ్యులర్ గా  ఆమెను తన క్యాబ్ లో డ్రాప్ చేస్తూ గమనిస్తూ... ఒకరోజు...ఈ అమ్మాయి ఏమిటి రోజూ మందేసి క్యాబ్ ఎక్కుతోంది అని డౌట్ వచ్చి క్యూరియాసిటీతో ఆ ముక్కే  అడిగేస్తాడు. అప్పుడు ఆమె ఎప్పుడు ఈ కథ చెప్దామా అని ఎదురుచూస్తున్నట్లుగా  ఓ ప్లాష్ బ్యాక్ విప్పుతుంది.తను ఒకరిని ప్రేమించానని, అతనికోసం పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చానని, కానీ మోసం చేసాడని వాపోతుంది. 

అప్పుడు మన హీరో వివేక్ ..కావాల్సినంత సానుభూతి చూపించి..ఆమెను తన  ప్రోత్సాహంతో  ఆమె కుటుంబానికి దగ్గర చేస్తాడు. ఆ ప్రాసెస్ లో బాబు కు కూడా ఆమె దగ్గర అవుతుంది. అతని ఐలవ్యూ అని చెప్పాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు అతను వివేక్ కాదు..నవీన్ అని తెలుస్తుంది. ఎందుకిలా పేరు మార్చుకున్నాడు..అతను గతం ఏమిటి..క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారాడు... ఆమె అంతకు ముందే అతనికి తెలుసా...అతని ప్లాష్ బ్యాక్ ఏమిటి...చివరకు ఈ ప్రేమ కథ ఏ తీరం చేరింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
   

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌, సిధ్ధార్ద్‌ మీనన్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సమీర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: కోడి దివ్య దీప్తి
దర్శకత్వం : శ్రీధర్‌ గాదె
మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్‌ అబ్బవరం
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫి: రాజ్‌ నల్లి
Running time: 130 minutes
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?