ఖైదీ కలెక్షన్స్.. తెలుగులో కార్తీ న్యూ రికార్డ్

By Prashanth MFirst Published Nov 8, 2019, 11:10 AM IST
Highlights

కార్తీ ఎలాంటి సినిమా చేసినా అది తెలుగులో రిలీజ్ అవ్వాల్సిందే. టాలీవుడ్ ఆడియెన్స్ అభిమానానికి ఫిదా అయ్యే కార్తీ తెలుగు నేర్చుకొని మరి సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు. కార్తీ మొదటి సినిమా యుగానికి ఒక్కడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువరోజులు ఆడింది.

టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో ఒకరు. కార్తీ ఎలాంటి సినిమా చేసినా అది తెలుగులో రిలీజ్ అవ్వాల్సిందే. టాలీవుడ్ ఆడియెన్స్ అభిమానానికి ఫిదా అయ్యే కార్తీ తెలుగు నేర్చుకొని మరి సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు. కార్తీ మొదటి సినిమా యుగానికి ఒక్కడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువరోజులు ఆడింది.

ఇక ఆవారా సినిమా కూడా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడంతో అప్పటి నుంచి కార్తీ ప్రతి సినిమా తెలుగులో అనువాదమవుతోంది. ఇక ఊపిరితో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. చాలా రోజుల తరువాత కార్తీ తెలుగు రాష్ట్రలో సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.

ఖైదీ సినిమా 12కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే సినిమా బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చింది. ఓ వైపు విజిల్ గట్టిపోటీని ఇచ్చినప్పటికీ కార్తీ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇక మొత్తానికి సినిమా లాభాలు అందించడంతో పాటు కార్తీ కెరీర్ లో ది బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ - సాంగ్స్ లేకపోవడం విశేషం. ఓన్లీ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో దర్శకుడు చేసిన ప్రయోగం వర్కౌట్ అయ్యింది.

click me!