సూపర్ స్టార్ తో రొమాన్స్.. గాల్లో తేలిపోతున్న కీర్తి సురేష్!

Published : Dec 09, 2019, 06:34 PM ISTUpdated : Dec 09, 2019, 06:37 PM IST
సూపర్ స్టార్ తో రొమాన్స్.. గాల్లో తేలిపోతున్న కీర్తి సురేష్!

సారాంశం

కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే 'నేను శైలజ' చిత్రంతో యువతని మాయ చేసింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ పెర్ఫామెన్స్, క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి.

కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే 'నేను శైలజ' చిత్రంతో యువతని మాయ చేసింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ పెర్ఫామెన్స్, క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ కు అనేక ఆఫర్స్ వచ్చాయి. కానీ గత ఏడాది కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి చిత్రం ఆమె ఇమేజ్ ని ఆకాశాన్ని తాకేలా చేసింది. 

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. ఫలితంగా మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ 168వ చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

వివేకం, విశ్వాసం, వేదాళం ఫేమ్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దర్శకుడు శివ ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

హీరోయిన్ విషయంలో తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లు ప్రకటించారు. కీర్తి సురేష్ కూడా తన సంతోషాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ఇది తన సినీ కెరీర్ లోనే ఓ మైలు రాయి అని కీర్తి సురేష్ గాల్లో తేలిపోతోంది. 

బాలయ్యని, పవన్ కళ్యాణ్ ని కలిస్తే జరిగేది ఇదే.. నిర్మాత హాట్ కామెంట్స్!

మాస్ ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు శివ దిట్ట. భారీ బడ్జెట్ లో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించనున్నాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?