ఏం వండుతుందో తెలియకుండానే వండేస్తున్న క్యాట్‌

Published : Apr 11, 2020, 12:31 PM ISTUpdated : Apr 11, 2020, 12:32 PM IST
ఏం వండుతుందో తెలియకుండానే వండేస్తున్న క్యాట్‌

సారాంశం

కత్రినా కైఫ్‌ మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. తన చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌తో కలిసి  వంట చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియా పేజ్ లో షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు `ఏం తయారు చేస్తున్నామో మాకు తెలియదు.. మొత్తం తయారయ్యాక ఏం రెడీ అవుతుందో తెలుస్తుంది` అంటూ కామెంట్ చేసింది.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినీ ప్రముఖలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్ లు ప్రయాణాలతో బిజీగా ఉండే తారలు ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరకటంతో ఇంటి పనుల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తాను ఇంటి పనుల్లో  బిజీగా ఉన్న వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ముందుగా వర్క్ అవుట్ వీడియోలను షేర్‌ చేసిన  క్యాట్ తరువాత ఇంటి పనులు చేస్తున్న వీడియోను కూడా షేర్‌ చేసింది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. తన చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌తో కలిసి  వంట చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియా పేజ్ లో షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు `ఏం తయారు చేస్తున్నామో మాకు తెలియదు.. మొత్తం తయారయ్యాక ఏం రెడీ అవుతుందో తెలుస్తుంది` అంటూ కామెంట్ చేసింది.

నిన్న (ఏప్రిల్‌ 10) సిబ్లింగ్స్‌ డే సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఇంటి పనిచేస్తున్న ఈ ఇంట్రస్టింగ్ వీడియోను షేర్‌ చేసింది. అక్కా చెల్లెలు ఇద్దరు చెఫ్‌ ల తయారై  ఈ వీడియోలో కనిపించారు. 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో బాలీవుడ్ స్టార్స్ అంతా అభిమానులను అలరించేందుకు రక రకాల వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?