స్వయంగా మాస్కులు కుట్టి, పంచుతున్న చిరంజీవి తల్లి!

By Satish ReddyFirst Published Apr 11, 2020, 10:49 AM IST
Highlights

కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో తన వంతు సాయం అంధించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి తల్లి, అంజనా దేవి కూడా ముందుకు వచ్చారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా మాస్కులు కుట్టి, అవసరమైన వారికి అందజేస్తున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న వేళ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రముఖుల ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఆర్ధిక సాయం చేయటంతో పాటు కొందరు ఆహర పదార్థాలు, నిత్యవసరాలను పంపిణీ చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయం అందించేందుకు ముందే ఉన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించిన ప్రముఖులు, సినీ రంగంలోని కార్మికులను ఆదుకునేందుకు కూడ చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో తన వంతు సాయం అంధించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి తల్లి, అంజనా దేవి కూడా ముందుకు వచ్చారన్న వార్త శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా మాస్కులు కుట్టి, అవసరమైన వారికి అందజేస్తున్నాన్నదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే వీరు 700కు పైగా మాస్కులను కుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. తన వయోభారాన్ని సైతం పక్కన పెట్టి ఈ ఆపత్కాలంలో తన వంతు సాయం అందిస్తున్నారని ఆమెపై ప్రశంసలు కూడా వెళ్లువెత్తుతున్నాయి.

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా రెండు మందికి పైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. దాదాపు 7వేల మందికి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారిని కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో ముందు ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే తెలంగాణ సహ పలు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగం ప్రదేశాల్లో మాస్కులు ధరించటం తప్పనిసరి చేశాయి.

click me!