కమెడియన్ కుమార్తె ఫోటోస్ వైరల్.. ఫిదా అవుతున్న సెలెబ్రిటీలు, నెటిజన్లు!

Published : Apr 02, 2020, 12:04 PM IST
కమెడియన్ కుమార్తె ఫోటోస్ వైరల్.. ఫిదా అవుతున్న సెలెబ్రిటీలు, నెటిజన్లు!

సారాంశం

ప్రముఖ బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కపిల్ శర్మ షోతో ఇండియా వ్యాప్తంగా ఈ టాలెంటెడ్ కమెడియన్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ప్రముఖ బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కపిల్ శర్మ షోతో ఇండియా వ్యాప్తంగా ఈ టాలెంటెడ్ కమెడియన్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ లాంటి బడా సెలెబ్రిటీలు సైతం ఈ కమెడియన్ తో మాట్లాడాలంటే తికమక పడతారు. 

ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా పంచ్ లు పేల్చడం కపిల్ శర్మకు వెన్నతో పెట్టిన విద్య. కపిల్ శర్మ ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినప్పటికీ ఇతడు కూడా కుటుంబానికి విలువిచ్చే వ్యక్తే. కపిల్ శర్మ, అతడి సతీమణి గిన్నీ ఛత్రాత్ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

నా శరీరంపై రెండు టాటూలు.. అక్కడ కూడా వేయించుకోవాలని ఉంది : తాప్సి

ఈ దంపతులకు గత ఏడాది డిసెంబర్ 10న కుమార్తె జన్మించింది. కపిల్ శర్మ ముద్దుల కుమార్తె పేరు అనయర. తాజాగా కపిల్ శర్మ తన మూడు నెలల ముద్దుల కుమార్తె ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తన ఇంట్లో  పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కపిల్ శర్మ ఈ ఫోటోలు అభిమానులతో పంచుకున్నాడు. 

 

బోసి నవ్వులు నవ్వుతున్న అనయర ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 24 గంటలు కూడా గడవక ముందే 13 లక్షల మందికి పైగా ఈ ఫోటోస్ ని లైక్ చేశారు. నెటిజన్లతో పాటు రిచా చద్దా, రాయ్ లక్ష్మి లాంటి సెలెబ్రిటీలు కూడా కపిల్ శర్మ కుమార్తెకు ఫిదా అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?