'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'.. ఆన్ లైన్ రిలీజ్..?

By AN TeluguFirst Published Dec 5, 2019, 4:23 PM IST
Highlights

సినిమా రిలీజ్ కి మాత్రం అడ్డంకులు వచ్చి పడ్డాయి. సాధారణంగా వర్మ సినిమాలకు ఇలాంటి గొడవలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రచారానికి పనికొస్తాయని భావించాడు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ సెన్సార్ అలానే పలు సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్ లాంటి వాళ్ల పాత్రల్ని ఈ సినిమాలో ఎంత ఎగతాళి చేసి, విమర్శించి చూపించారో ప్రోమోలు చూస్తే అర్ధమవుతోంది.

ప్రోమోల కారణంగా సినిమాకి పబ్లిసిటీ ఓ రేంజ్ లో వచ్చింది. రిలీజ్ కి ముందు బజ్ మాములుగా లేదు. కానీ సినిమా రిలీజ్ కి మాత్రం అడ్డంకులు వచ్చి పడ్డాయి. సాధారణంగా వర్మ సినిమాలకు ఇలాంటి గొడవలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రచారానికి పనికొస్తాయని భావించాడు.

దిశ అఘాయిత్యం.. పవన్ కామెంట్స్ పై సుమన్ ఫైర్!

కానీ ఈ గొడవలు, కోర్టు కేసులు, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. బహుసా వర్మ కూడా ఇది ఊహించి ఉండడు. ఈ సినిమా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారు ఈ సినిమా విషయంలో అంత సానుకూలంగా ఉన్నట్లు లేరు.

ఇక ఈ సినిమాను వ్యతిరేకిస్తూ కేఏ పాల్, అలానే మరికొంతమంది కోర్టుకి వెళ్లారు. అలానే సెన్సార్ వాళ్లు ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో దాదాపు తొంబై శాతం సన్నివేశాల్లో మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఈ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది.

అక్కడ కూడా పని జరగకపోవడంతో ఈ సినిమా ఇక థియేటర్లలోకి వచ్చే అవకాసం లేదని అంటున్నారు. ఇన్ని మార్పులు చేయడం అసాధ్యం కాబట్టి థియేట్రికల్ రిలీజ్ మీద ఆశలు వదులుకొని.. నేరుగా సినిమాను ఆన్ లైన్ లో రిలీజ్ చేసే ఆలోచనలో వర్మ ఉన్నట్లు సమాచారం. 

click me!