kamma rajyamlo kadapa reddlu: వర్మపై కేఏ పాల్ పిటిషన్!

Published : Nov 21, 2019, 12:29 PM IST
kamma rajyamlo kadapa reddlu: వర్మపై కేఏ పాల్ పిటిషన్!

సారాంశం

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, కేఏపాల్, తమ్మినేని ఇలా ఏపీ రాజకీయనాయకుల పాత్రలను తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నాడు వర్మ.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సిద్ధార్ధ తాతోలు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని ఉద్దేశించి ఈ సినిమాని రూపొందించారు.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, కేఏపాల్, తమ్మినేని ఇలా ఏపీ రాజకీయనాయకుల పాత్రలను తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు ట్రైలర్ లను విడుదల చేశారు.

kamma rajyamlo kadapa reddlu:''మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే..'' ఎన్టీఆర్ ని ఉద్దేశించేనా..?

ఈ రెండు ట్రైలర్లలో కూడా కేఏపాల్ పాత్ర కనిపించింది. 'జబర్దస్త్' షో కమెడియన్ రాము ఈ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై కేఏ పాల్ కోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో తన క్యారెక్టర్ ని అవమానించేలా చిత్రీకరించారని కేఏ పాల్ హైకోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదలకు నిలిపేయాలని కేఏ పాల్ కోర్టుని కోరారు. 

ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్టు, వర్మ, జబర్దస్త్ కమెడియన్ రాముల పేర్లని చేర్చారు. పాల్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?