ఖైదీ చిత్రానికి అరుదైన గౌరవం

Satish Reddy   | Asianet News
Published : Aug 01, 2020, 05:26 PM ISTUpdated : Aug 01, 2020, 07:49 PM IST
ఖైదీ చిత్రానికి అరుదైన గౌరవం

సారాంశం

కార్తీ నటించిన చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. `ఖైదీ` సినిమా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

తమిళ హీరో కార్తి నటించిన `ఖైదీ` చిత్రం గతేడాది బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. పాటలు, హీరోయిన్‌ లేని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పూర్తిగా థ్రిల్లింగ్‌ అంశాలతో సాగి ఘన విజయం సాధించింది. అటు తమిళంలోనే కాదు, తెలుగులోనూ విశేష ఆదరణ పొందింది. కార్తికి ఓ కొత్త రకమైన ఇమేజ్‌ని తీసుకొచ్చింది. కమర్షియల్‌గా భారీ కలెక్షన్లని కూడా రాబట్టింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 9 నుంచి 15 వరకు ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని కెనడాలో ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. త‌మ చిత్రానికి ఇంత గౌర‌వం ద‌క్కడంపై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తుంది.


ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాని నటించిన 'జెర్సీ' కూడా ఎంపికైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నుంచి హృతిక్‌ రోషన్‌ నటించిన `సూపర్‌ 30` ఎంపిక కావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు