justice for disha: న్యాయం జరిగింది.. ఎన్టీఆర్!

By AN TeluguFirst Published Dec 6, 2019, 9:42 AM IST
Highlights

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. 

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

Justice for disha: పోలీసుల కాళ్లు మొక్కాలనుంది.. మంచు మనోజ్

సంఘటన స్థలంలోనే కరడుకట్టిన కామాంధులైన ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ మొదట దిశ హత్యాచారం కేసుపై కామెంట్ చేయనప్పటికీ  ఇప్పుడు మాత్రం న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. ఇప్పుడు దిశ ఆత్మకి శాంతి కలుగుతుందని అన్నారు. 

 

JUSTICE SERVED! Now, Rest In Peace Disha.

— Jr NTR (@tarak9999)
click me!