తండ్రికి గుర్తుగా ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడంటే..!

Published : Mar 22, 2020, 10:36 AM IST
తండ్రికి గుర్తుగా ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడంటే..!

సారాంశం

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ లో ఎన్టీఆర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోగా కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్ అందుకునే ఎన్టీఆర్ త్వరలో నిర్మాత కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రెండవసారి నటించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఎన్టీఆర్ ఈ చిత్రంలో వాటా తీసుకోబోతున్నట్లు టాక్. ఇకపై ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల నుంచి నిర్మాణ భాగస్వామిగా మారాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్, ప్రభాస్ లాంటి హీరోలంతా చేస్తోంది అదే. దీని కోసం ఎన్టీఆర్ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

'ఆంటీ' ని చేసి డైరక్టర్ దెబ్బకొట్టాడు

తన ప్రొడక్షన్ హౌస్ కు తన తండ్రి గుర్తుగా నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇకపై ఎన్టీఆర్ నిర్మాతగా ఎన్ హెచ్ ఏ బ్యానర్ లో సినిమాలు  రాబోతున్నాయన్నమాట. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని ఏర్పాటు చేయగా, బాలయ్య ఎంబీకే సంస్థని ఏర్పాటు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?