బాలయ్య భగవంత్ కేసరి కి సీక్వెల్ ఉందా..? క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ కొటింది బాలయ్ - అనిల్ కాంబినేషన్. ఇక ఈకాంబోలో మరో సినిమా ప్లానింగ్ లో ఉందా..? అది కూడా భగవంత్ కేసరికి సీక్వెల్ గా తెరకెక్కబోతుందా..? ఈ విషయంలో డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి..? 

Google News Follow Us

భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ కొటింది బాలయ్ - అనిల్ కాంబినేషన్. ఇక ఈకాంబోలో మరో సినిమా ప్లానింగ్ లో ఉందా..? అది కూడా భగవంత్ కేసరికి సీక్వెల్ గా తెరకెక్కబోతుందా..? ఈ విషయంలో డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి..? 

బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ అందించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.  బాలకృష్ణ  హీరోగా అనిల్ రావిపూడి  ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా  పాజిటీవ్ టాక్ తో.. నడుస్తోంది. అంతే కాదు వంద కోట్ల కలెక్షన్ మార్క్ ను కూడా దాటింది మూవీ. దాంతో నందమూరి ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 

ఇక ఈసినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించగా.. బాలయ్య జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ నటించింది. అయితే బాలకృష్ణ అనగానే వినిపించి.. కనిపించే రొటీన్ కు స్వస్తి చెప్పి.. రెగ్యూలర్ యాక్షన్ మూవీలా కాకుండా డిఫరెంట్ గా తెరకెక్కించాడు  అనిల్ రావిపూడి.  రొటీన్ కు భిన్నంగా  ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది.

ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ మూవీపై రకరకాల వాదలను వినిపిస్తున్నాయి. జాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా మూవీ టీమ్ అంతా సందడి చేశారు. సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ పై  కూడా స్పందించాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం నాకు లేదు. ఈ బరువు మోసినందుకే ఇన్నాళ్లు నేను చాలా నలిగిపోయాను. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే, వెనకాల నేను ఉన్నాను అంటే వెంటనే సీక్వెల్ తీస్తాను అని అన్నారు. 

ఇక ఈమూవీ తరువాత బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నారు. ఈమూవీకి సబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. దాని కోసం బాలయ్య తన లుక్ ను కూడా మార్చేసుకున్నారు.