'జబర్దస్త్' కమెడియన్ బెడ్రూమ్ టాపిక్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

Published : Jan 11, 2020, 11:00 AM ISTUpdated : Jan 11, 2020, 11:48 AM IST
'జబర్దస్త్' కమెడియన్ బెడ్రూమ్ టాపిక్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

సారాంశం

శ్రీముఖి 'పటాస్' షో నుండి తప్పుకున్న తరువాత వర్షిణి ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. చలాకీ చంటితో కలిసి ఆమె కాస్త బోల్డ్ పంచ్ లే వస్తోంది. గ్లామరస్ తో కనిపించడంతో పాటు జనాలను మెప్పించడం కోసం కాస్త బోల్డ్ గా మారింది. 

బుల్లితెరపై సుమ నెంబర్ 1 యాంకర్ స్థానంలో దూసుకుపోతుంటే.. అనసూయ, రష్మి లాంటి వాళ్లు ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరి తరువాత లిస్ట్ లో శ్రీముఖి వస్తుంది. ఏ షో అయినా సరే వీరిని దాటాతేనే మిగిలిన యాంకర్లకు అవకాశాలు వస్తాయి.

ఇలాంటి పోటీ నేపధ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తోంది యాంకర్ వర్షిని. శ్రీముఖి 'పటాస్' షో నుండి తప్పుకున్న తరువాత వర్షిణి ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. చలాకీ చంటితో కలిసి ఆమె కాస్త బోల్డ్ పంచ్ లే వస్తోంది. గ్లామరస్ తో కనిపించడంతో పాటు జనాలను మెప్పించడం కోసం కాస్త బోల్డ్ గా మారింది.

'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ!

ఇప్పటికే ఓ స్టూడెంట్ బుగ్గలు కొరికిన విషయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు. కానీ వర్షిణి మాత్రం తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. ఇటీవల 'పటాస్' షోలో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ చేసిన పనికి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది వర్షిణి. స్కిట్ లో భాగంగా అవినాష్ ముందుగా లవ్ క్లాసెస్ అంటూ వర్షిణి తో కలిసి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టాడు.

ఆ సమయంలో వర్షిణి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. లవ్ క్లాసెస్ తరువాత బెడ్రూమ్ క్లాసెస్ ఉంటాయని అవినాష్ చేసిన కామెంట్ కి వర్షిణి అతడి చెంపపై కొట్టింది. నవ్వుతూనే అతడి చెంప చెళ్లు మనిపించింది. కానీ ఆ యాక్ట్ తో అవినాష్ షాక్ అయ్యాడట. కానీ కెమెరా ముందుకు మాత్రం ఏం జరగనట్లు నటించినట్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?