బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

By tirumala AN  |  First Published Feb 9, 2020, 12:40 PM IST

ఇళయదళపతి విజయ్ కేంద్రంగా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఇళయదళపతి విజయ్ కేంద్రంగా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నేరుగా షూటింగ్ స్పాట్ లోనే అధికారులు విజయ్ ని ప్రశ్నించారు. అనంతరం అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. 

గత కొన్ని రోజులుగా హీరో విజయ్. బిగిల్ చిత్రంతో ఆర్థికంగా సంబంధం ఉన్న వ్యక్తులపై ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం దాడులు శనివారం రోజుతో ముగిసాయి. ఈ సోదాల్లో విజయ్ నివాసంతో పాటు, బిగిల్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నివాసంలో దాదాపు రూ 77 కోట్ల డబ్బుని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

ఆ డబ్బుని ఐటీ అధికారులు బ్యాగుల్లో వేసి సీజ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిగిల్ చిత్రాన్ని ఏజిఎస్ సంస్థ నిర్మించింది. అన్బు చెలియన్ ఈ చిత్రానికి ఫైనాన్స్ చేశారు. 

గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!

ఐటీ దాడుల అనంతరం విజయ్ నైవేలీ ప్రాంతంలోని గనుల్లో షూటింగ్ తో బిజీ అయిపోయాడు. పెద్ద ఎత్తున అక్కడికి బిజెపి కార్యకర్తలు చేరుకోవడం, షూటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం వివాదంగా మారింది. బిజెపి కార్యకర్తలకు పోటా పోటీగా విజయ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 

విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

విజయ్ పై ఐటీ దాడుల వెనుక బిజెపి ప్రభుత్వ కక్షపూరిత చర్య కారణమని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. గతంలో విజయ్ మెర్సల్ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం సంచలన విజయం అందుకుంది. ఆ చిత్రంలో విజయ్ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని వ్యతిరేకిస్తూ చెప్పిన డైలాగులు వివాదంగా మారాయి. ఆ డైలాగుల కారణంగానే బిజెపి ప్రస్తుతం విజయ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని విజయ్ అభిమానులు అంటున్నారు. 

40 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

click me!