భార్యని కొట్టిన సీరియల్ నటుడు.. పోలీసుల అరెస్ట్!

Published : Dec 02, 2019, 10:21 AM IST
భార్యని కొట్టిన సీరియల్ నటుడు.. పోలీసుల అరెస్ట్!

సారాంశం

ఐశ్వర్ భార్య జయశ్రీ టీవీ నృత్య దర్శకురాలు. కాగా ఐశ్వర్ తన భార్యకి చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడని సమాచారం.

భార్యని కొట్టిన సీరియల్ నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక తిరువాన్మయూర్, ఎల్ బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ నివాసం ఉంటున్నారు. ఐశ్వర్ భార్య జయశ్రీ టీవీ నృత్య దర్శకురాలు.

కాగా ఐశ్వర్ తన భార్యకి చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడని సమాచారం. దీంతో భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. అదే విధంగా శనివారం నాడు కూడా ఈ విషయంపై ఐశ్వర్ రఘునాథన్ కి జయశ్రీల మధ్య వాగ్వాదం జరిగింది.

బయ్యర్ వెనక్కి: దేవరకొండ కెరీర్ లోనే పెద్ద షాక్

దీంతో సహనం కోల్పోయిన ఐశ్వర్ రఘునాథన్ తన భార్యని కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జయశ్రీ.. అడయార్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంది. అనంతరం ఆమె అడయార్ మహిళా పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుల్లితెర నటుడు ఐశ్వర్ రఘునాథన్ ని, అతడికి సహకరించిందనే ఆరోపణలతో అతడి తల్లిని అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?