వామ్మో.. ఏంటా క్రేజ్.. 'రాజమౌళి రామాయణం తీయాలి'.. ఇండియా మొత్తం ట్రెండింగ్!

By tirumala ANFirst Published May 3, 2020, 5:49 PM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు. దీనితో రాజమౌళికి ఇండియా మొత్తం క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు. దీనితో రాజమౌళికి ఇండియా మొత్తం క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. 

ఇదిలా ఉండగా మహాభారతం తెరకెక్కించాలనేది రాజమౌళి డ్రీమ్. అలాగే రామాయణం కూడా రాజమౌళి మనసులో ఉంది. ఎప్పటికైనా ఆ పురాణాల్ని వెండితెరపై ఆవిష్కరించాలనే కోరికతో రాజమౌళి ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఆ మహా కావ్యాలని తెరకెక్కించే అనుభవం తనకు లేదని పలు వేదికలపై రాజమౌళి పేర్కొన్నారు. 

ఇటీవల లాక్ డౌన్ కారణంగా దూరదర్శన్ లో 80ల కాలం నాటి చారిత్రాత్మక టివి సిరీస్ రామాయణంని తిరిగి ప్రసారం చేశారు. ఈ టివి సిరీస్ ప్రపంచంలోనే అత్యధికంగా 77 మిలియన్ల మంది వీక్షించిన టివి సిరీస్ గా రికార్డ్ సృష్టించింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి పాపులర్ టివి సిరీస్ రికార్డ్ నే బద్దలు కొట్టింది. 

కష్టాల్లో స్నేహితుడు.. ఆదుకోబోతున్న పవన్ కళ్యాణ్ !

దీనితో అభిమానుల్లో రామాయణంని మరొక్కసారి వెండితెరపై చూడాలనే కోరిక పుట్టింది. రామాయణం లాంటి మహా కావ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించగల ధీరుడు ఎవరు అనే అభిమానులు ఆలోచించగా.. వారికి వెంటనే దొరికిన సమాధానం దర్శక ధీరుడు రాజమౌళి. 

దీనితో ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశం మొత్తం సోషల్ మీడియాలో రాజమౌళి గురించే చర్చ. RajamouliMakeRamayan అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రామాయణం టివి సిరీస్ దర్శకుడు రామానంద్ సాగర్ స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి రాజమౌళి అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. 

click me!