సినిమా చేయమంటూ పవన్ పై ఒత్తిడి తెస్తున్న నిర్మాత!

Published : Oct 17, 2019, 01:40 PM IST
సినిమా చేయమంటూ పవన్ పై ఒత్తిడి తెస్తున్న నిర్మాత!

సారాంశం

2019 ఎన్నికల ముందుకు పవన్‌ ఇక తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అప్పటట్లో  ప్రకటించాడు. వేరే ఇతర యావగేషన్ లేకుండా  పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు.

పవన్ కళ్యాణ్ సినిమా చేయరంటూ వార్తలు వచ్చినా సరే...ఆయన మళ్లీ రీఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ చాలా అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఓ నిర్మాత సైతం పవన్ పై తిరిగి సినిమా చేయమంటూ ఒత్తిడి తెస్తున్నారట. కానీ పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాట ప్రకారం...రాజకీయాల్లోనే కొనసాగుతాను..తప్ప సినిమా చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారట.  

2019 ఎన్నికల ముందుకు పవన్‌ ఇక తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అప్పటట్లో  ప్రకటించాడు. వేరే ఇతర యావగేషన్ లేకుండా  పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అయితే ఊహించని విధంగా ..రాజకీయాల్లో పవన్‌ విఫలం అయ్యారు. దాంతో పవన్  సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ  మొదలైంది.

ముఖ్యంగా ఎలక్షన్స్ కు చాలా సమయం ఉంది కాబట్టి ఈ లోగా ఓ సినిమా చేయమని ఆ నిర్మాత పవన్ పై చాలా ప్రెజర్ చేస్తున్నారట. వేరే నిర్మాత అయితే పవన్ ఊరుకునేవారు కాదు. కానీ ఆ ఒత్తిడి చేస్తున్న నిర్మాత మరెవరో కాదు సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్ రత్నం అని తెలుస్తోంది. 2001లో పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఖుషీ ప్రొడ్యూసర్ ఆయన.
 
పవన్ కళ్యాణ్ తో గత కొంతకాలంగా సినిమా చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు ఎఎమ్ రత్నం. ఆయన ఎప్పుడో అడ్వాన్స్ సైతం ఇచ్చారు. అంతేకాదు పవన్ కు అవసరమైనప్పుడు ఫండ్స్ కూడా ఎరేంజ్ చేసారట. పవన్ వాటిని తన రాజకీయ ప్రస్దానంలో భాగంగా జనసేన పార్టీ కోసం ఖర్చు పెట్టారు. దాంతో ఇప్పుడు పవన్ దగ్గరకు డైరక్టర్స్ ని పంపి కథ చెప్పిస్తూ..సినిమా చేయమని కోరుతున్నారట రత్నం. లేదా తను ఇచ్చిన మొత్తం అయినా తిరిగి ఇవ్వమని అంటున్నారట. అయితే పవన్ ఇప్పుడు తిరిగి వెనక్కి ఇచ్చే పరిస్దితిలో లేనని చెప్పారట. కాబట్టి ఎఎమ్ రత్నంకు పవన్ ఓ సినిమా చేసే అవకాసం ఉందిట. అయితే దర్శకుడు ఎవరు, కథ ఏమిటి అనేది మెల్లిగా ఫైనలైజ్ అయ్యే అవకాసం ఉందని వినికిడి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?