రామ్ చరణ్ నటనకు ఇన్ఫోసిస్ సుధామూర్తి ఫిదా.. రంగస్థలంపై ప్రశంసలు!

By tirumala ANFirst Published Feb 9, 2020, 6:49 PM IST
Highlights

మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. చిరుత మగధీర చిత్రాలతో స్టార్ గా మారిపోయాడు. ఒక్కో చిత్రంతో రాంచరణ్ నటనలో పరిణితి కనబరుస్తూ వస్తున్నాడు. ఇక 2018లో విడుదలైన రంగస్థలం చిత్రం అయితే చరణ్ ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.

మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. చిరుత మగధీర చిత్రాలతో స్టార్ గా మారిపోయాడు. ఒక్కో చిత్రంతో రాంచరణ్ నటనలో పరిణితి కనబరుస్తూ వస్తున్నాడు. ఇక 2018లో విడుదలైన రంగస్థలం చిత్రం అయితే చరణ్ ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ చిత్రంలో వినికిడి లోపం ఉన్న పల్లెటూరి కుర్రాడిగా చరణ్ నటన అద్భుతం. 

ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చరణ్ నటనని ప్రశంసించారు. తాజాగా ఆ జాబితాలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి చేరారు. ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలుగు సినిమాల గురించి మాట్లాడారు. తాను చిన్న వయసులో ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలు దానిని అని అన్నారు. 

కృష్ణుడంటే ఎలా ఉంటాడో మనం చూడలేదు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే మొదటగా కృష్ణుడే గుర్తుకువస్తాడు. మాయాబజార్, దానవీర శూర కర్ణ లాంటి, భక్త ప్రహ్లాద లాంటి చిత్రాలు చూశాను. అన్నమయ్య, ఓం నమో వేంకటేశాయ చిత్రాలు కూడా చూశా. రీసెంట్ గా రంగస్థలం చిత్రం చూశా. చాలా బావుంది. రాంచరణ్ అద్భుతంగా నటించాడు అని ప్రశంసించారు. 

'నువ్వే దిశాని ఏదో చేశావ్'.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్!

అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన మనం చిత్రం కూడా చూశానని సుధా మూర్తి తెలిపారు. అలాగే కన్నడ చిత్రాలు కూడా తాను చూస్తానని అన్నారు.  

click me!